: తుని ఘటనలో వాళ్లిద్దరూ ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే


తుని ఘటనకు సంబంధించిన అరెస్ట్ లపై వైఎస్సార్సీపీ తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారని, ఈ విధ్వంసం జరిగిన ప్రాంతంలో వాళ్లిద్దరూ లేరని అన్నారు. ఒకవేళ, వాళ్లిద్దరూ ఉన్నట్లు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన సవాల్ విసిరారు. కాగా, తుని ఘటనకు సంబంధించి ఈరోజు ఏడుగురిని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News