: తప్పులు ఎత్తి చూపితే ఇంతగా భయపెడతారా?: టీఆర్ఎస్ పై వీహెచ్ నిప్పులు
తెలంగాణలో దొరల, గడీల పాలనను గుర్తుకు తెస్తున్న కేసీఆర్ ప్రభుత్వం తీరుపై జేఏసీ నేత కోదండరామ్ చేసిన ఆరోపణల్లో తప్పేమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం పొన్నం ప్రభాకర్ తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన, పాలనలో తప్పులు ఎత్తి చూపిన కోదండరామ్ ను భయపెడతారా? అని ప్రశ్నించారు. క్యాబినెట్ మొత్తం ఒకవైపు నిలిచి కోదండరామ్ ను విమర్శించడం తగదని హితవు పలికారు. కేసీఆర్, ఆయన మంత్రుల తీరును ప్రజలు గమనిస్తున్నారని, వారికి బుద్ధిచెప్పే రోజు త్వరలోనే వస్తుందని అన్నారు. తప్పులు చూపితే, భయపెట్టే ధోరణిని మార్చుకోకుంటే గుణపాఠం తప్పదని హెచ్చరించారు.