: కనకదుర్గమ్మ సన్నిధిలో ఘాట్ రోడ్డు, మెట్ల మార్గాలు మూసివేసిన అధికారులు... భక్తుల తీవ్ర ఆగ్రహం


మరమ్మతు పనులు జరుగుతున్నాయని చెబుతూ, విజయవాడ కనకదుర్గమ్మ కొండపైకి ఉన్న ఘాట్ రోడ్డును, కృష్ణానది పుష్కర ఘాట్ నుంచి ఉన్న మెట్ల మార్గాన్ని అధికారులు మూసివేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొండపైకి ఈ రెండు దారులతో పాటు మహామండపం మీదుగా మరో మెట్లదారి ఉంది. ఆ దారిని మాత్రం తెరచివుంచగా, ఏడంతస్తుల ఎత్తయిన మెట్లను ఎక్కలేక వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరో నెల రోజుల పాటు ఘాట్ దారిని, మెట్ల దారిని తెరచేది లేదని ఈఓ స్పష్టం చేయగా, భక్తులు తీవ్ర ఆగ్రహంతో వాగ్వాదానికి దిగారు. మెట్లదారిని తెరవాల్సిందేనని భక్తులు పట్టుబడుతున్నారు. ఆగస్టులో రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త క్యూలైన్లు, కంపార్టుమెంట్లు ఏర్పాటు చేయాల్సి వుందని, రహదారిని మెరుగుపరచాల్సి వుందని వెల్లడించిన ఈఓ, భక్తులు సహకరించాలని కోరారు.

  • Loading...

More Telugu News