: చంద్రబాబు పాలన గురించి ఒక్క మాటలో, రెండు మాటల్లో, మూడు మాటల్లో చెప్పిన రోజా


"ఏపీ చంద్రబాబునాయుడు పాలన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, 'ప్రజా కంటక పాలన' అని చెప్పవచ్చు. రెండు మాటల్లో చెప్పాలంటే, 'సంక్షోభం, దుర్భిక్షం' అని చెప్పొచ్చు. మూడు మాటల్లో చెప్పాలంటే, 'అవినీతి, అరాచకం, అసమర్థత' అని చెప్పొచ్చు. ఈ రోజు అవినీతి చూస్తే, చంద్రబాబునాయుడు, లోకేష్ ల అవినీతి ఇస్రో ప్రయోగిస్తున్న రాకెట్ల కన్నా వేగంగా దూసుకుపోతోంది. తండ్రీ కొడుకులు బరితెగించి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారో మనం కళ్లారా చూస్తున్నాం" అని వైకాపా ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆమె, ప్రజల్ని మోసం చేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేష్ లు గుడిని, గుడిలో లింగాన్ని కూడా మింగేసే రకాలని, ఈ విషయాన్ని ఈ రెండేళ్లలో కళ్లారా చూశామన్నారు. తన అవినీతిని ప్రశ్నించినందునే వైకాపా అధినేత జగన్ పై విరుచుకుపడుతున్నారని విమర్శించారు. ఈ దేశంలో క్యాబినెట్ సమావేశాలకు ముఖ్యమంత్రి కుమారుడు హాజరు కావడం ఒక్క ఏపీలోనే జరుగుతోందని అన్నారు. అది మన రాష్ట్రం దౌర్భాగ్యమని, ప్రతి క్యాబినెట్ మీటింగులోను ఆయన పాల్గొంటున్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News