: ‘జంపింగ్’ ఆగేనా?... కోమటిరెడ్డితో జానారెడ్డి కీలక భేటీ!
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ లోకి వలసల జోరు కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా త్వరలోనే గులాబీ గూటికి చేరనున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనను నిలువరించేందుకు టీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి రంగంలోకి దిగారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్లిన జానారెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డితో భేటీ అయ్యారు. వెంకట్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలపైనే వీరిద్దరూ చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ భేటీ ముగియగానే జానారెడ్డి మీడియాతో మాట్లాడనున్నారు. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ లోనే ఉంటారా? లేక జానారెడ్డి రాయబారాన్ని కూడా తిరస్కరించి కారెక్కుతారా? అన్న దిశగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.