: హోదా ఇస్తారా? ఇవ్వరా?... స్మృతీ ఇరానీని నిలదీసిన విద్యార్థి!
నేడు విజయవాడలో పర్యటిస్తున్న కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. గుజరాతీ విద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పలు కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థినీ విద్యార్థులతో ఆమె ముచ్చటిస్తున్న వేళ, ఓ విద్యార్థి ప్రత్యేక హోదాపై సూటి ప్రశ్న సంధించి ఆమెను ఇరకాటంలో పడేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టాటస్ వస్తుందా? మీరు ఇస్తారా? ఇవ్వరా? ఎప్పటిలోగా విషయాన్ని స్పష్టం చేస్తారు? అంటూ ఆ విద్యార్థి ప్రశ్నించాడు. సమాధానం చెప్పేందుకు అరక్షణం ఆలోచించిన స్మృతీ ఇరానీ, "ఈ విషయం నా శాఖ పరిధిలోనిది కాదు. అంతకన్నా ఇంకేమీ చెప్పలేను" అంటూ తప్పించుకున్నారు. ఆపై మరో విద్యార్థిని ప్రశ్నించాలని కోరారు.