: వరంగల్లో సీనియర్ లాయర్ అరాచకం.. యువతిని లొంగదీసుకొని రెండు రోజులుగా తీవ్ర చిత్రహింసలు
వరంగల్లో ఓ సీనియర్ లాయర్ అరాచకం సృష్టించాడు. తన వద్ద ప్రాక్టీసు కోసం చేరిన ఓ యువతిని లొంగదీసుకుని తీవ్రంగా వేధించిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్లో దయానంద్ అనే ఓ సీనియర్ లాయర్ జూనియర్ గా ప్రాక్టీసు కొనసాగిస్తున్న ఓ యువతిని రెండు రోజులుగా చిత్రహింసలకు గురిచేశాడు. ఆమెను పెళ్లి చేసుకోనివ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డాడు. రెండు రోజులుగా ఆమెను ఓ గదిలో బంధించి చిత్ర హింసలు పెట్టాడు. ఎవ్వరినీ పెళ్లి చేసుకోవద్దంటూ జూనియర్పై దాడి చేశాడు. సీనియర్ లాయర్ బారి నుంచి తప్పించుకున్న ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.