: విజయవాడలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పర్యటన ప్రారంభం
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ విజయవాడ పర్యటన ప్రారంభమైంది. నగరంలోని పాతబస్తీలో నిర్వహిస్తోన్న గుజరాతీ సమాజ్ కార్యక్రమంలో ఆమె పాల్గొంటున్నారు. గుజరాతీ స్కూల్‌లో నూతన ల్యాబ్‌ను ఆమె ప్రారంభించారు. విద్యార్థులతో ఆమె ముఖాముఖి నిర్వహించనున్నట్లు సమాచారం. ఆమెతో పాటు ఆంధ్రప్రదేశ్ నేతలు కామినేని, ఎంపీ కంభంపాటి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేయతలపెట్టిన గుజరాతీల సమావేశంలో మరికాసేపట్లో స్మృతి పాల్గొంటారు. ఈరోజు మధ్యాహ్నం సీఎం చంద్రబాబుతో ఆమె భేటీ అవుతారు.