: కళానికేతన్ డైరెక్టర్ కు 14 రోజుల రిమాండ్!... ‘అనంత’ జిల్లా జైలుకు తరలింపు!
చేనేత కార్మికులను నిట్టనిలువునా ముంచేసిన కళానికేతన్ డైరెక్టర్ లక్ష్మీశారద కటకటాలు లెక్కించక తప్పలేదు. దాదాపు రూ.9 కోట్ల బకాయిలను చెల్లించకుండా ముప్పుతిప్పలు పెడుతున్న కళానికేతన్ ఎండీ, డైరెక్టర్లపై చేనేత కార్మికుల నుంచి ఫిర్యాదులు అందుకున్న అనంతపురం జిల్లా ధర్మవరం పోలీసులు నిన్న నాటకీయ పరిణామాల మధ్య హైదరాబాదులో లక్ష్మీశారదను అరెస్ట్ చేశారు. రాత్రికి రాత్రే అనంతపురం జిల్లాకు తరలించిన పోలీసులు కొద్దిసేపటి క్రితం ఆమెను ధర్మవరం కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో ఆమెకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత ఆమెను పోలీసులు అనంతపురంలోని జిల్లా జైలుకు తరలించారు.