: వాళ్ల తీరు బాగోలేదు.. వాళ్లది అనవసర రాద్ధాంతం: తెలంగాణ నేతలపై మండిపడ్డ దేవినేని
సాగునీటి ప్రాజెక్టులు, నీటి పంపకాలు, కృష్ణాబోర్డ్‌పై ఫిర్యాదులు అంశాలపై తెలంగాణ నేతల తీరు బాగాలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ఢిల్లీ వెళ్లి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఈరోజు విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. కృష్ణా బోర్డు సాగునీటి పంపకాలలో చేసిన ఆదేశాలను తెలంగాణ పక్కన పెట్టిందని ఆయన అన్నారు. తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపు జరిగిందని ఆయన చెప్పారు. ఈ అంశంపై కృష్ణానదీ యజమాన్య బోర్డు కల్పించుకోవడం కోసం సంతకాలు కూడా జరిగాయని ఆయన అన్నారు. సాగునీటి పంపకాల అంశంపై తాము చర్చకు సిద్ధమని సవాలు విసిరారు.