: అమలాపురం పోలీస్ స్టేషన్‌లో బైఠాయించిన ముద్రగడ.. ఉద్రిక్తత
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పోలీస్ స్టేషన్‌లో కాపునేత ముద్రగడ పద్మనాభం బైఠాయించారు. తుని ఘటనలో పాల్గొన్న ఆరుగురి అరెస్టుపై ఆయన నిరసన తెలుపుతున్నారు. అమాయకులను అరెస్టు చేస్తే ఊరుకోబోమని, కాపు ఉద్యమానికి కర్త, కర్మ తాను మాత్రమేనని ఆయన అంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యకర్తలను విడిచి పెట్టే వరకు ఆందోళన విరమించబోనని ఆయన చెబుతున్నారు. ముద్రగడ అనుచరులు, కాపు నాయకులు పలువురు పోలీసు స్టేషన్‌కు చేరుకుంటున్నారు. పోలీసులు ముద్రగడకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనను మరికాసేపట్లో అరెస్టు చేసే అవకాశం ఉంది.