: సికింద్రాబాదులోని యాపిల్ ఔట్ లెట్ ను కొల్లగొట్టిన చోరులు!... రూ.25 లక్షల విలువ చేసే ఐఫోన్లు ఎత్తుకెళ్లిన వైనం
స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ ఔట్ లెట్ లో దొంగలు పడ్డారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ చోరీ కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే... సికింద్రాబాదు పరిధిలోని ఎస్డీ రోడ్ లో ఉన్న మినర్వా కాంప్లెక్స్ లో ‘అపెక్స్ యాపిల్ ఔట్ లెట్’ ఉంది. నిన్న ఉదయం అందులో పనిచేసే సిబ్బంది విధులకు వచ్చి చూసేసరికి షట్టర్ తాళాలు పగులగొట్టి ఉన్నాయి. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఔట్ లెట్ లో చోరీ జరిగినట్లు నిర్ధారించారు. లోపలికి వెళ్లి పరిశీలించిన సిబ్బంది... మొత్తం రూ.24.85 లక్షల విలువ చేసే ఐఫోన్లతో పాటు రూ.51 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు తేల్చారు.