: సోషల్ మీడియాలో సత్తా చాటుతున్న సుష్మా!... ట్విట్టర్ లో అత్యధిక మంది ఫాలోయర్లున్న మహిళా నేతగా రికార్డు!


ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో సత్తా చాటుతున్నారు. మోదీ అడుగు జాడల్లోనే నడుస్తున్న బీజేపీ సీనియర్ మహిళా నేత, ఆయన కేబినెట్ లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న సుష్మా స్వరాజ్ కూడా సోషల్ మీడియాలో దూసుకెళుతున్నారు. ట్విట్టర్ లో ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలోయర్లున్న మహిళా నేతగా సుష్మా సరికొత్త రికార్డు నెలకొల్పారు. ప్రస్తుతం సుష్మా ట్విట్టర్ ఖాతాను ఫాలో అవుతున్న వారి సంఖ్య అర కోటి (50 లక్షలు) దాటేసింది. వెరసి ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ లో అత్యధిక మంది ఫాలోయర్లున్న వారి జాబితాలో పదో స్థానంలో నిలిచిన సుష్మా... మహిళల్లో అగ్రభాగానికి ఎగబాకారు. ‘ట్విప్లోమసీ-2016’ పేరిట గ్లోబల్ కమ్యూనికేషన్స్ సంస్థ ‘బర్సన్ మార్స్ టెల్లర్’ ఈ జాబితాను విడుదల చేసింది.

  • Loading...

More Telugu News