: హెచ్-1బీ వీసా మోసం... ఇద్దరు భారతీయ సోదరులకు అమెరికాలో ఏడేళ్ల జైలుశిక్ష


అమెరికా వెళ్లి ఉద్యోగం చేయాలని భావించే ఐటీ, సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ లో ఎంతో పాప్యులర్ అయిన హెచ్-1బీ వీసాల విషయంలో మోసపూరిత కుట్రలకు పాల్పడిన భారతీయ సోదరులకు అమెరికాలో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. అతుల్ నందా (46), జై నందా (45)లకు 87 నెలల కారాగార శిక్షను విధిస్తున్నట్టు చీఫ్ యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి బార్బారా ఎంజీ లిన్ తీర్పిచ్చారు. వీరిద్దరూ వీసాల విషయంలో మోసం చేశారని, వారిపై కేసులు నిరూపితమయ్యాయని యూఎస్ అటార్నీ జాన్ పార్కర్ తెలిపారు. అమెరికాలో వ్యాపారం నిమిత్తం వచ్చేవారు, విదేశీ ఉద్యోగులు విరివిగా వాడే ఈ వీసాలను ఉపయోగించుకుని వారు లబ్ధి పొందారని పేర్కొన్నారు. కాగా, డిబాన్ సొల్యూషన్స్ పేరిట ఐటీ కన్సల్టింగ్ కంపెనీని టెక్సాస్ లో ప్రారంభించిన నందా సోదరులు, ఇండియా సహా పలు దేశాల నుంచి ఉద్యోగులకు హెచ్-1బీ వీసాలను విక్రయించినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరంతా డిబాన్ హెడ్ క్వార్టర్స్ లో పనిచేస్తారని చెప్పి, వీసాలు పొందినట్టు ప్రధాన ఆరోపణ.

  • Loading...

More Telugu News