: నియంత పాలిస్తున్న ఉత్తర కొరియా దేశంలో ఉన్నట్టుంది!: 'ఉడ్తా పంజాబ్' నిర్మాత సెటైర్!


తన తాజా చిత్రం 'ఉడ్తా పంజాబ్'కు ఎనలేని కట్స్ చెప్పడంతో పాటు చిత్రంలో పంజాబ్ పేరు వినిపించరాదని, రాజకీయాలు, ఎన్నికలకు సంబంధించిన అంశాలన్నీ తొలగించాలని సెన్సార్ బోర్డు ఇచ్చిన ఆదేశాలపై బాలీవుడ్ నిర్మాత అనురాగ్ కశ్యప్ విరుచుకుపడ్డారు. తనకు ఓ నియంత పాలిస్తున్న ఉత్తర కొరియా దేశంలో ఉన్నట్లుందని, ఇక అక్కడికి వెళ్లేందుకు విమానం కూడా అక్కర్లేదని, కొరియా పాలన ఇండియాలోనే నడుస్తుందన్న అర్థం వచ్చేలా ట్వీట్లు వదిలాడు. ఇండియాలో చిత్ర నిర్మాతలకు స్వాతంత్ర్యం లేకుండా పోయిందని ఆరోపించాడు. కాగా, షాహిద్ కపూర్, ఆలియా భట్ తదితరులు నటించిన ఈ చిత్రం పంజాబ్ లో సాగుతున్న మాదకద్రవ్యాల వ్యాపారాన్ని ప్రస్తావిస్తూ తీసిన సంగతి తెలిసిందే. తాను ఈ చిత్రాన్ని నిజాయతీతో తీశానని, డ్రగ్స్ వ్యాపారాన్ని ఏ రాజకీయ పార్టీ లేదా వ్యక్తులు ప్రమోట్ చేస్తున్నట్టు చూపలేదని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News