: ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇక ఓపెన్ బ్యాలెట్!... రాష్ట్రాల అభిప్రాయాలను కోరిన కేంద్రం


సాధారణ ఎన్నికల కంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. వైరి వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు ఆయా రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరహా ప్రలోభాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తోంది. ఇప్పటిదాకా రహస్య పద్ధతిన జరుగుతున్న ఈ ఎన్నికలను ఇకపై ఓపెన్ బ్యాలెట్ పధ్ధతిలో జరిపేందుకు దాదాపుగా నిర్ణయించింది. ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటని కేంద్రం... శాసనమండలి వ్యవస్థ అమలులో ఉన్న ఆరు రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఈ మేరకు ఈ విషయాన్ని నిన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ ధ్రువీకరించారు.

  • Loading...

More Telugu News