: దేశంలోనే తొలిసారి.. అసోం ‘సిటీ యానిమల్’ గా గంగానది డాల్ఫిన్
జాతీయ జంతువు, రాష్ట్ర జంతువుల గురించి తెలుసు. కానీ, మన దేశంలో ఇంతవరకూ లేని ‘సిటీ యానిమల్’ కాన్సెప్ట్ ను అసోంలోని గువాహటి నగరం తొలిసారిగా ప్రకటించింది. గువాహటి నగర జంతువుగా గంగానది డాల్ఫిన్ ను నిర్ణయిస్తున్నట్లు కామరూప్ మెట్రోపాలిటన్ డిప్యూటీ కమిషనర్ ఎం.అంగముత్తు పేర్కొన్నారు. నగర జంతువు కోసం ఆన్ లైన్, ఆఫ్ లైన్ ఓటింగ్ నిర్వహించినట్లు తెలిపారు. గంగానది డాల్ఫిన్ తో పాటు తాబేలు, కొంగ పేర్లను ఓటింగ్ కు ఉంచామని, ఈ ఓటింగ్ లో మొత్తం అరవైవేల మంది పాల్గొనగా గంగానది డాల్ఫిన్ పేరుకు ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పారు.