: దర్శనమిచ్చిన నెలవంక...రేపటి నుంచే 'రోజా' ప్రారంభం
హైదరాబాదులో నెలవంక దర్శనమిచ్చింది. దీంతో ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావించే రంజాన్ మాసం ప్రారంభమైందని ఆ మతపెద్దలు ప్రకటించారు. రేపటి నుంచి 'రోజా' ప్రారంభమవుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రోజాలో భాగంగా ముస్లింలు కఠినమైన నియమావళితో కూడిన ఉపవాస దీక్షను నెల రోజులకు పైగా పాటించనున్నారు. ముస్లిం మతాచారం ప్రకారం మళ్లీ నెలవంక కనిపించిన తరువాత రోజాను పూర్తి చేసి, రంజాన్ ను వేడుకగా నిర్వహిస్తారు.