: సినిమా చూసి బస్సెక్కడం ఈజీగా ఉంటుంది: దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ
ఎక్కడో సినిమా చూసి బస్టాండ్ కు హడావుడిగా చేరుకుని బస్సెక్కడం కన్నా, బస్టాండ్ లో ఉన్న థియేటర్లలోనే సినిమా చూసి బస్సెక్కడం చాలా ఈజీగా, హాయిగా ఉంటుందని దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. విజయవాడ బస్టాండ్ లో ‘వై స్క్రీన్’ అనే థియేటర్లు ఈరోజు నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కాన్సెప్ట్ చాలా బాగుందని అన్నారు. ప్రయాణికులు వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు బోర్ కొట్టకుండా, ఎంటర్ టెయిన్ మెంట్ కోసం ఇక్కడి థియేటర్లలో సినిమాలకు వెళ్లవచ్చన్నారు. దీని ద్వారా సినిమాలకు కొత్త ఆడియన్స్ ను ఆకర్షించుకున్నట్లు కూడా అవుతుందని భరద్వాజ అన్నారు.