: ఇకపై పాండిచ్చేరి రోడ్లపై వీఐపీ కార్ల సైరన్ మోగదు
పాండిచ్చేరి రోడ్లపై కార్ల సైరన్ ను నిషేధించారు. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఆదేశాలు జారీ చేశారు. ఆమె ఎస్కార్ట్, పైలట్ కార్లు వీఐపీల కార్లు సహా సైరన్ నిషేధించారు. కేవలం, ఎమర్జెన్సీ వాహనాలైన అంబులెన్స్, ఫైర్ ఇంజన్లకు మాత్రమే రోడ్లపై సైరన్ వేస్తూ వెళ్లేందుకు అనుమతిస్తారంటూ ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. రాజకీయనాయకులు లేదా ఇతర ప్రముఖులు తమ ‘స్పెషల్ ప్రివిలేజెస్’ గురించి ఆలోచించవద్దని, ముఖ్యంగా సాధారణ ప్రజల వాహనాలను ఆపివేసి తమను అనుమతించాలనే పద్ధతికి వారు దూరంగా ఉండాలని కిరణ్ బేడీ సూచించారు.