: బాలీవుడ్ హీరోలు సల్మాన్, షారూఖ్ లకు కోర్టులో ఊరట
బాలీవుడ్ అగ్రనటులు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ లు బిగ్ బాస్ సీజన్ 9 సందర్భంగా దేవాలయం సెట్లోకి షూష్ ధరించి ప్రవేశించి హిందువుల మనోభావాలను కించపరచారంటూ దాఖలైన ఫిర్యాదుపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. ఈ హీరోలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్న పిటిషనర్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. అయితే, ఈ విషయంపై ఆధారాలు సమర్పించాలంటూ కేసు దాఖలు చేసిన గౌరవ్ గులాటీకి అక్టోబర్ 14 వరకు గడువిచ్చింది. ఆయన ఇంతకు ముందే ఆ షోలో ప్రదర్శించిన వీడియోను న్యాయస్థానానికి అందజేశారు. దీనిపై బిగ్ బాస్ నిర్వాహకులు ఇంతకు ముందే న్యాయస్థానానికి వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. అది టెంపుల్ కాదని, టెంపుల్ సెట్ అని, అందులో దేవుడు ఉండడని, అక్కడ దేవుడిని దర్శించుకునేందుకు ఎవరూ రారని తెలిపిన సంగతి తెలిసిందే. పోలీసులు కూడా ఇదే విషయాన్ని న్యాయస్థానానికి వివరించారు. దీంతో ఈ కేసు నిలబడే అవకాశం లేదని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు.