: విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో క్రికెటర్ లక్ష్మణ్
మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కుటుంబ సమేతంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. లక్ష్మణ్ కు దేవస్థానం ఈవో ప్రభాకర్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. లక్ష్మణ్ తో పాటు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు గోకరాజు గంగరాజు, మాజీ క్రికెటర్ ఎంఎస్ కే ప్రసాద్ లు కూడా దుర్గమ్మని దర్శించుకున్నారు.