: కాంగ్రెస్ నాయకులు మతిస్థిమితం కోల్పోయారు: తెలంగాణ ప్రభుత్వ విప్
కాంగ్రెస్ పార్టీ నాయకులు మతి స్థిమితం కోల్పోయారని, అందుకే, తెలంగాణ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ ఆ పార్టీ నాయకులు మారలేదని అన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, నోరు అదుపులో పెట్టుకుని ఆయన మాట్లాడాలని అన్నారు. అవినీతిలో పేటెంట్ హక్కులన్నీ కాంగ్రెస్ పార్టీవేనని, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాడు మంత్రిగా ఉన్నప్పుడు ‘ఇందిరమ్మ’ పథకాన్ని అవినీతి పథకంగా మార్చారని ఓదెలు ఆరోపించారు.