: ముద్రగడ కాపు ఉద్యమ నేత ఎలా అయ్యారు?: బొండా ఉమ ప్రశ్నలు
కాపు రిజర్వేషన్ ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభంపై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ ఫైరయ్యారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, 60 వేల కాపు ఓట్లున్న నియోజకవర్గంలో కేవలం 8 వేల ఓట్లు సాధించిన ముద్రగడ కాపు ఉద్యమనేత ఎలా అవుతారని ప్రశ్నించారు. ఆయనను సొంత నియోజకవర్గంలోని కాపులే నమ్మలేదని అన్నారు. కాపు రిజర్వేషన్లపై ముద్రగడకు చిత్తశుద్ధి ఉంటే ముందుగా కలవాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబును కానీ, ప్రతిపక్ష నేతలను కాదని ఆయన హితవు పలికారు. ప్రతిపక్ష నేతలు నిర్ణయాలు తీసుకోరన్న విషయం ముద్రగడ తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు.