: ఇరవై ఏండ్లు కొట్లాడిన మాకు తెలంగాణను ఎలా అభివృద్ధి చేసుడో తెల్వదా?: కోదండరామ్


తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత తాము ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయడం లేదని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కొదండరామ్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 20 ఏండ్లు తెలంగాణ కోసం కొట్లాడిన తమకు తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలో తెల్వదా? అని అన్నారు. తెలంగాణ అవసరాలు ఏంటో, తెలంగాణలో ఉన్న వనరులు ఏంటో, తెలంగాణలో ఏ పనులు చేపడితే అభివృద్ధి ప్రజలకు చేరుతుందో తమకు తెలుసని ఆయన చెప్పారు. ప్రభుత్వం చేపట్టనున్న కార్యక్రమాలను ఇంకో మూడేళ్లు చూద్దామని ఆయన ప్రజలకు సూచించారు. అప్పటికి కూడా అభివృద్ధి పనులు సరైన దిశలో సాగకపోతే...ఏం చేయాలో తమకు తెలుసని ఆయన పేర్కొన్నారు. తమకు దురాశ లేక పేరాశ లేదని ఆయన స్పష్టం చేశారు. సగటు తెలంగాణ పౌరుడు అభివృద్ధి చెందితే తమకు అదే చాలని ఆయన చెప్పారు. దాని కోసమే తాము ఇన్నాళ్లూ కష్టపడ్డామని ఆయన తెలిపారు. అది సిద్ధంచకపోతే సంఘటితమయ్యేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరికలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఇప్పటికే పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News