: ‘ప్రధాని’ కావాలనే కోరిక నాకు లేదు: బీహార్ సీఎం నితీశ్ కుమార్


వచ్చే సాధారణ ఎన్నికల్లో నాన్-బీజేపీ ఫ్రంట్ తరపున ప్రధాని అభ్యర్థి నితీశ్ కుమార్ అంటూ వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తాను ఎంపీ కావాలని కోరుకునేవాడినే తప్ప, ప్రధాన మంత్రి కావాలనే ఆలోచన తనకు ఎన్నడూ రాలేదని చెప్పారు. ‘నా జీవితంలో కనీసం ఒకసారైనా ఎంపీ కావాలనుకున్నా. మంత్రి కావాలని, ముఖ్యమంత్రి లేదా ప్రధాన మంత్రి కావాలనే కలలు మాత్రం కనలేదు’ అని ఒక కార్యక్రమంలో పాల్గొన్న నితీశ్ పేర్కొన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తాను పీఎం అభ్యర్థినంటూ కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారం చేస్తూ తనకు అపకీర్తి తెచ్చేలా చేస్తున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News