: భూసేకరణ చట్టం ముందు ప్రభుత్వ జీవోలు చెల్లవు: కోదండరామ్
తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నేటి ఉదయం నుంచి టీఆర్ఎస్ నేతలు ఎన్ని విమర్శలు చేస్తున్నా కౌంటర్ ఇవ్వని కోదండరామ్, మల్లన్నసాగర్ భూసేకరణ నిలిపేయాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. మెదక్ లో ఈరోజు ఆయన మాట్లాడుతూ, 2013 భూసేకరణ చట్టం ముందు తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలు చెల్లవని స్పష్టం చేశారు. గ్రామ సభ ఏర్పాటు చేసి, భూసేకరణ చేస్తున్న భూమికి పరిహారంగా ఇచ్చే ధరను నిర్ణయించాలని ఆయన డిమాండ్ చేశారు. భూసేకరణ నిబంధనలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆయన మండిపడ్డారు.