: జగన్ సైకోలా ప్రవర్తిస్తున్నారు: టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైకోలా ప్రవర్తిస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురజాల మండలంలోని సత్రశాలలో కృష్ణా పుష్కర ఘాట్ల పనులను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. ఒక ప్రతిపక్షనేతలా కాకుండా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్న జగన్ కు ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వచ్చాయని యరపతినేని అన్నారు.