: జేఏసీని ఏర్పాటు చేసింది కోదండరామ్ కాదు.. కేసీఆర్!: ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్
రాజకీయ జేఏసీని ఏర్పాటు చేసింది కోదండరామ్ కాదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాజకీయ జేఏసీని ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. తెలంగాణను బాగు చేసేందుకు పదేళ్లు పడుతుందని గతంలో కోదండరామ్ పేర్కొన్నారని ఆయన గుర్తుచేశారు. అప్పుడు పదేళ్లు పడుతుందని చెప్పిన కోదండరామ్ ఇప్పుడు రెండేళ్లకే విమర్శలు చేయడం వెనుక ఉధ్దేశ్యం ఏంటని ఆయన నిలదీశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు మానుకోవాలని ఆయన కోందడరామ్ కు సూచించారు.