: తాగడానికే నీళ్లు లేవు.. మద్యానికి ఎందుకు..? సరఫరా నిలిపేయండి: హైకోర్టులో రేవంత్ రెడ్డి పిల్
హైదరాబాద్ మహానగరంలో నీళ్లు దొరక్క ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో మద్యం కంపెనీలకు నీరు అందివ్వడం ఎందుకంటూ టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. ఓ పక్క తాగడానికి కూడా నీళ్లు దొరక్క నగరవాసులు తీవ్ర ఇక్కట్లు పడుతుంటే, మరోపక్క మద్యం కంపెనీలకు నీళ్లు సరఫరా చేయడం ఏంటని ఆయన దుయ్యబట్టారు. ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తోన్న మద్యం కోసం నీళ్లు సరఫరా చేయడం అవసరమా..? అని ఆయన ప్రశ్నించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. మద్యం కంపెనీలకు నీటి సరఫరాపై మూడు వారాల్లో లిఖిత వాంగ్మూలం సమర్పించాలని వాటర్ బోర్డ్, జీహెచ్‌ఎంసీకి నోటీసులు జారీ చేసింది.