: చంద్రబాబు గురించి నాడు ఎన్టీఆర్ ఏమన్నారో తెలుసా..?: వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి
‘చంద్రబాబు గురించి నాడు ఎన్టీఆర్ ఏమన్నారో తెలుసా? చంద్రబాబు ఆత్మను అమ్ముకున్నాడు... ఔరంగజేబు వారసుడని ఎన్టీఆర్ అన్నారు’ అని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన చూపించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ, చంద్రబాబు రాజకీయంపై వైఎస్ జగన్ యుద్ధం చేస్తున్నారని, ప్రజల బాధ జగన్ గొంతులో వినిపిస్తోందని అన్నారు. చంద్రబాబుపై వచ్చినన్ని ఆరోపణలు మరే నేతపైన రాలేదని, జగన్ పై బాబు మాటలు విడ్డూరంగా ఉన్నాయని విమర్శించారు. నిధులు పొంగిపొర్లే పథకం పట్టిసీమ అని, అవినీతికి ఆస్కారం ఉన్నందునే, జగన్ ఆ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. హామీలను నెరవేర్చమంటే అభివృద్ధిని అడ్డుకోవడం అవుతుందా? అని ఆయన ప్రశ్నించారు.