: సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి మోదీని కలవాలి, కుట్రను ఆపాలి: ఎమ్మెల్యే కోమటిరెడ్డి
తెలంగాణ నిర్మిస్తోన్న సాగునీటి ప్రాజెక్టుల అంశంపై ఆంధ్రప్రదేశ్ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. ఈరోజు హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నేతలు కృష్ణా బోర్డుపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ నిర్మిస్తోన్న ప్రాజెక్టులు పూర్తి కాకుండా ఆంధ్రప్రదేశ్ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆయన అన్నారు. ఏపీ ప్రభుత్వానికి తలొగ్గి కృష్ణా బోర్డు సూచిస్తోన్న అంశాలు అమల్లోకి వస్తే తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు ఎడారులను తలపిస్తాయని ఆయన అన్నారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లాలని ఆయన సూచించారు. ఢిల్లీకి వెళ్లి ఈ అంశాన్ని ఢిల్లీ పెద్దల మధ్య ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.