: నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ప్రజలు నమ్మరు: కోదండరాంపై ఈటల విసుర్లు
కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఇక గద్దె దిగాలని జేఏసీ చైర్మన్ కోదండరామ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని రాజకీయ నేతలు, మేధావులు కేసీఆర్ ప్రభుత్వ పాలనను కొనియాడుతుంటే, కోదండరామ్ విమర్శించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, కేసీఆర్ అన్ని పార్టీలనూ ఏకం చేశారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ పుట్టకముందే ప్రత్యేక తెలంగాణ ప్రకటన వచ్చిందని గుర్తు చేసిన ఆయన, నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ప్రజలు నమ్మరని అన్నారు. రూ. 17 వేల కోట్ల మేర రైతు రుణాలను మాఫీ చేశామని వివరించారు.