: భారత చరిత్రలో తొలిసారి... విద్యుత్ లోటు లేని సంవత్సరమిదే!


భారతదేశ చరిత్రలో తొలిసారిగా అధికారికంగా విద్యుత్ కోతలు లేని సంవత్సరంగా 2016-17 నిలువనుంది. ఈ ఏడాది పీక్ అవర్స్ లో సైతం 3.1 శాతం అదనపు విద్యుత్ అందుబాటులో ఉందని కేంద్ర విద్యుత్ అధారిటీ తాజా గణాంకాలు వెల్లడించాయి. ఇండియాలో విద్యుత్ కొరత లేకుండా, మిగులు విద్యుత్ నమోదు కావడం ఇదే తొలిసారి. 2015-16లో పీక్ అవర్ లో 3.2 శాతం కొరత నమోదైందని, ఈ ఏడు దాన్ని అధిగమించామని అధికారులు తెలిపారు. పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకుంటూ రావడమే ఇందుకు కారణమని వివరించారు. బొగ్గు లభ్యత సంతృప్తికరంగా ఉండటం కూడా థర్మల్ పవర్ ప్లాంట్ల ఉత్పత్తిని నిలిపిందని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తరువాత విద్యుత్ మిగులు నమోదు కావడం మోదీ టీమ్ సాధించిన పెద్ద ఘనతేనని విద్యుత్ రంగ నిపుణులు వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా సగటున మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ, కొన్ని రీజియన్లలో మాత్రం విద్యుత్ కోతలు కొనసాగించాల్సి వస్తోందని అధికారులు వివరించారు. కాగా, ఇదేమీ ఎన్డీయే ఘనత కాదని, తాము తీసుకున్న చర్యల ఫలితమే నేడు విద్యుత్ మిగులుకు కారణమని మాజీ విద్యుత్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News