: జగన్‌కు గంటెలతో వాతలు పెట్టండి: మహిళలకు సూచించిన కేఈ కృష్ణమూర్తి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి చెప్పులతో పాటు చీప్లుర్లు కూడా చూపించాలంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న అనంతపురంలో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఈరోజు జరిగిన నవనిర్మాణ దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. విభజన తరువాత ఎన్నో కష్టాలను ఎదుర్కుంటోన్న ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపించడానికి చంద్రబాబు ఎంతో కష్టపడుతున్నారని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. చెప్పులు, చీపుర్లను చూపించాలని జగన్ మోహన్ రెడ్డి అనడం దారుణమని కేఈ కృష్ణమూర్తి అన్నారు. హుందాగా ప్రవర్తించాల్సిన ప్రతిపక్షనేత ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, అటువంటి మాటలు జగన్ నోటినుంచి రాకుండా మహిళలు గంటెలతో ఆయనకు వాతలు పెట్టాలని ఆయన వ్యాఖ్యానించారు.