: 1999లో ఇదే రోజు... భారత కీర్తి పతాకం సగర్వంగా ఎగిరిన వేళ!


సరిగ్గా 17 సంవత్సరాల క్రితం, ఇదే రోజు... లియాండర్ పేస్, మహేష్ భూపతిల జోడి భారత్ కు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను సాధించి పెట్టిన రోజు. జూన్ 6, 1999న గొరాన్ ఇవానిసెవిక్, టారాంగో జోడీని 6-2, 7-5 తేడాతో రెండు వరుస సెట్లలో ఓడించిన పేస్, భూపతిల జోడి భారత కీర్తి పతాకాన్ని సగర్వంగా నింగిలో ఎగిరేలా చేసింది. భారత టెన్నిస్ రంగాన్ని నేడు విశ్వవ్యాప్తం చేసిన, సానియామీర్జా, రోహన్ బొప్పన వంటి ఆటగాళ్లలో ఆనాడు టెన్నిస్ పట్ల మక్కువ పెరిగేలా చేసింది. అంతకుముందు సంవత్సరంలో మూడు గ్రాండ్ స్లామ్ పోటీల్లో సెమీస్ వరకూ చేరుకున్న జోడీ, ఆస్ట్రేలియన్ ఓపెన్ లో తృటిలో గ్రాండ్ స్లామ్ ను కోల్పోయింది. ఆపై ఫ్రెంచ్ ఓపెన్ ను ఒడిసి పట్టింది. ఆనాటి మధుర ఘటనను, తమ అనుభూతులను పేస్, భూపతి నెమరేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News