: బెజవాడ బస్టాండ్ లో సినిమా థియేటర్లు!... దేశంలోనే తొలి బస్టాండ్ థియేటర్ ఇదేనట!
బస్టాండ్ లో వేచి చూడాల్సి వస్తే ఏం చేస్తాం? ఎదురుగా కనిపించే టీవీ తెరలకేసి చూస్తాం. అప్పటికీ టైంపాస్ కాకపోతే... బస్టాండ్ కు కాస్తంత దూరంలోని థియేటర్లకు కూడా వెళతాం. ఇక ఈ తరహా ఇబ్బందులు అవసరం లేదు. ఇక ఎంచక్కా బస్టాండ్ లోనే సినిమా చూసేయొచ్చు. ఈ తరహా ఏర్పాటు దేశంలోనే తొలిసారిగా ఏపీలోని విజయవాడలో అందుబాటులోకి వచ్చింది. ఏపీఎస్ఆర్టీసీ వినూత్న ఆలోచనకు ‘వై స్ర్కీన్’ అనే థియేరట్ల నిర్మాణ సంస్థ కార్యరూపమిచ్చింది. అత్యంత అధునాతన టెక్నాలజీతో బెజవాడ బస్టాండ్ లో రూపొందిన ఈ థియేటర్ ను ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేటి ఉదయం లాంఛనంగా ప్రారంభించారు.