: విక్టరీ వెంకటేశ్ ‘బాబు బంగారం’ సినిమా టీజర్ అదుర్స్.. మ‌రోసారి వెంకీ నోట ‘అయ్యో అయ్య‌య్యో’! డైలాగ్‌


విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా దర్శకుడు మారుతి రూపొందిస్తోన్న చిత్రం ‘బాబు బంగారం’. 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్' సినిమాతో మంచి హిట్ ను కొట్టిన తరువాత మారుతి రూపొందిస్తోన్న ఈ చిత్రంపై వెంకీ అభిమానులు భారీ ఆశ‌లే పెట్టుకున్నారు. ఈ సినిమాలో వెంక‌టేశ్‌ స‌ర‌స‌న అందాల తార న‌య‌న‌తార న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ సినిమా టీజ‌ర్ ఈరోజు విడుద‌లైంది. వెంకీ ఖాకీ డ్ర‌స్‌ లో, ఫైటింగ్‌ చేస్తూ, న‌య‌న‌తో చిందులు వేస్తూ క‌నిపిస్తోన్న ఈ టీజ‌ర్‌ అభిమానులను అలరించేలా వుంది. గతంలో 'బొబ్బిలిరాజా' చిత్రంలో వెంక‌టేశ్ చెప్పిన ఫేమ‌స్ డైలాగ్ ‘అయ్యో అయ్యో అయ్యయ్యో’ను ఈ సినిమాలోనూ ఉప‌యోగించారు. త్వ‌ర‌లో ఈ సినిమా ఆడియో విడుద‌ల చేయ‌నున్నారు. ఇక ఈ సినిమాను వ‌చ్చేనెల 1న విడుద‌ల చేయనున్న‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News