: ప్యూర్టోరికోలో హిల్లరీ భారీ విజయం... మరో 30 ఓట్లు వస్తే అభ్యర్థిత్వం ఖరారు


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున బరిలోకి దిగేందుకు మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్ కు మార్గం మరింత సుగమమైంది. తాజాగా ప్యూర్టోరికోలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి బెర్నీ శాండర్స్ పై ఆమె స్పష్టమైన ఆధిక్యం చూపి విజయం సాధించారు. అభ్యర్థిత్వానికి మొత్తం 2,383 మంది ప్రతినిధుల ఓట్లు కావాల్సి వుండగా, ఇప్పటివరకూ ఆమె ఖాతాలోకి 2,353 ఓట్లు చేరిపోయాయి. మరో 30 ఓట్లు లభిస్తే ఆమె అభ్యర్థిత్వం ఖరారు కానుంది. ప్యూర్టోరికోలో పడ్డ ప్రతి మూడు ఓట్లలో రెండు హిల్లరీకే పడ్డట్టు తెలుస్తోంది. అమెరికాకు ఓ మహిళా అధ్యక్షురాలి కోసం మరింత కాలం పాటు వేచిచూసే ఉద్దేశం లేదని ఆమెకు ఓటేసిన 83 ఏళ్ల కాన్ డిడా డోన్స్ వ్యాఖ్యానించడం గమనార్హం.

  • Loading...

More Telugu News