: టీడీపీ దళిత నేతలపై రౌడీ షీట్!... కృష్ణా జిల్లా అగిరిపల్లిలో హైటెన్షన్!
టీడీపీకి కంచుకోటలా ఉన్న కృష్ణా జిల్లాలో ఆ పార్టీకి చెందిన కొందరు దళిత నేతలపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. జిల్లాలోని అగిరిపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన ఈ రౌడీ షీట్లకు నిరసనగా టీడీపీ దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సదరు రౌడీ షీట్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు దిగారు. అయితే అధికార పార్టీ నేతలన్న విషయాన్ని కూడా మరచిపోయిన పోలీసులు వారిపై లాఠీలు ఝుళిపించారు. అయితే, ఏ కారణం చేత టీడీపీ దళిత నేతలపై రౌడీ షీట్లు ఓపెన్ అయ్యాయన్న విషయం తెలియరాలేదు. టీడీపీకే చెందిన దళిత నేతలను పోలీసులు చితకబాదిన ఈ వ్యవహారంపై కలకలం రేగుతోంది.