: మరోమారు పేట్రేగిపోయిన హఫీజ్ సయీద్!.. భారత్ పై డ్రోన్లతో అణుదాడికి పాక్ సిద్ధమంటూ ప్రకటన!
పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ మరోమారు పేట్రేగిపోయాడు. నిత్యం భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ పాక్ లో యథేచ్ఛగా సంచరిస్తున్న సయీద్ తాజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పాకిస్థాన్ కు వ్యతిరేకంగా భారత్ చర్యలు చేపడితే... అణు బాంబులతో కూడిన డ్రోన్లతో విరుచుకుపడేందుకు పాక్ సిద్ధంగా ఉందని అతడు సంచలన ప్రకటన చేశాడు. పాక్ పై భారత్ భూభాగం నుంచి చిన్న డ్రోన్ దాడి జరిగినా, భారత్ ఘోరంగా దెబ్బతినడం ఖాయమేనని అతడు వ్యాఖ్యానించాడు. మొత్తం భారత్ నే నాశనం చేసే స్థాయిలో పాక్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయంటూ అతడు చేసిన వ్యాఖ్యలను ఓ టీవీ ఛానెల్ ప్రసారం చేసింది.