: ఢిల్లీలో ఘోరం.. తల్లీకూతుళ్లను దారుణంగా హత్య చేసిన వైనం


ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. పలువురు దుండగులు ఓ మ‌హిళ‌ను, ఆమె ఇద్ద‌రు కూతుళ్లను క‌త్తుల‌తో పొడిచి చంపేశారు. నిన్న వెలుగులోకొచ్చిన ఈ ఘ‌ట‌న స్థానికుల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేసింది. అక్క‌డి బ్రహ్మపుర ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో నుంచి దుర్వాస‌న రావ‌డంతో స్థానికులు ఆ విష‌యాన్ని పోలీసుల‌కి ఫోన్ చేసి చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తాళం ప‌గ‌ల‌గొట్టి ఇంట్లోకి వెళ్లారు. ఇంట్లో నివాస‌ముంటోన్న 50 ఏళ్ల మ‌హిళ‌, ఆమె ఇద్ద‌రు కుమార్తెలు ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉండడం గమనించారు. వారిపై క‌త్తిపోట్లు క‌నిపించాయి. 50ఏళ్ల‌ సైరా అనే మ‌హిళ‌, ఆమె కూతుళ్లు మెహరున్నీసా (19), షబ్నం (9) గొంతుకలను దుండ‌గులు దారుణంగా కోసేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు. దుండ‌గులు వీరిని మూడు రోజుల క్రితం హ‌త్య చేసి ఉండొచ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాల‌ను పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి త‌ర‌లించిన పోలీసులు హంత‌కుల‌ కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News