: మా ఊళ్లోకి ఆయ‌న శ‌వాన్ని తీసుకు రావ‌ద్దు: పోలీసులకు మథుర వాసుల ఝ‌ల‌క్‌


‘ఆ శవం మాకొద్దు.. ఆయ‌న శ‌వాన్ని మా ఊళ్లోకి తీసుకు రావ‌ద్దు..’ అని ఉత్త‌ర ప్రదేశ్‌లోని మ‌థుర వాసులు పోలీసుల‌కి ఝ‌ల‌క్ ఇచ్చారు. అల్ల‌ర్ల‌కు పురిగొల్పి 24మంది మృతికి కార‌ణ‌మైన వ్య‌క్తి భౌతిక కాయాన్ని మేము మా ఊళ్లోకి అనుమ‌తించ‌బోమ‌ని రామ్‌ వృక్ష్‌ యాదవ్ మృతదేహాన్ని వారు తిర‌స్క‌రించారు. అక్క‌డి పూర్ బాఘ్ పూర్, ఘాజిపూర్ వాసుల నుంచి ఎదురైన ఈ స‌మాధానంతో పోలీసులు ఆశ్చ‌ర్యానికి గురయ్యారు. ఇటీవల మథురలోని జవహర్‌ బాగ్ పార్కును ఆక్ర‌మించి అక్క‌డ నివాసాలు ఏర్పాటు చేసుకున్న‌ వారిని అక్క‌డి నుంచి పోలీసులు పంపించే క్ర‌మంలో యాదవ్ నేతృత్వంలో ఆయ‌న అనుచ‌రులు హింస‌ను రేపిన సంగ‌తి తెలిసిందే. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో అక్క‌డి 24మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో రామ్‌ వృక్ష్‌ యాదవ్ కూడా ఉన్నాడు.

  • Loading...

More Telugu News