: హ్యాకింగ్ కు గురైన ఫేస్‌బుక్ సీఈవో జుక‌ర్ బ‌ర్గ్ సోష‌ల్ మీడియా అకౌంట్లు


‘బగ్ బౌంటీ ప్రోగ్రాం’తో ఫేస్‌బుక్ యూజ‌ర్ల అకౌంట్లు ఏ మాత్రం హ్యాకింగ్‌కి గురి కాకుండా నెటిజ‌న్లే పెద్ద‌ ఎత్తున్న బ‌గ్‌ల‌ను క‌నిపెట్టేలా చేస్తూ ఆ సంస్థ చ‌ర్య‌లు తీసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. అయితే పేస్‌బుక్ అధినేత జుకర్ బర్గ్ సోష‌ల్ మీడియా అకౌంట్లే హ్యాకింగ్‌కు గుర‌యితే..? ఇప్పుడు అదే జ‌రిగింది. సౌదీ అరేబియాకు చెందిన ఓ హ్యాకింగ్ గ్రూపు ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకునే ఫేస్‌బుక్ అధినేత జుక‌ర్ బ‌ర్గ్ సోషిల్ మీడియా అకౌంట్ల‌పై అటాక్ చేసింద‌ట‌. జుక‌ర్ బ‌ర్గ్ కు చెందిన ఫేస్‌బుక్ ఖాతా మాత్ర‌మే కాదు. ఆయ‌నకు చెందిన ఇన్ స్టాగ్రాం, లింక్డెన్, పింటరెస్ట్, ట్విట్టర్ ఖాతాల్లో కూడా హ్యాక‌ర్లు చొర‌బ‌డి వాటిని చెడ‌గొట్టేశార‌ట‌. జుక‌ర్‌బ‌ర్గ్ త‌న‌ ఇన్ స్టాగ్రాం ఖాతాను తెరిచేందుకు ఎంత ప్ర‌య‌త్నించినా అది తెరుచుకోవ‌డం లేద‌ట‌. ఆయన ఈమెయిల్ అకౌంట్‌పై కూడా హ్యాకర్స్ దాడి చేసేందుకు చూస్తున్నార‌ట‌. జుక‌ర్ బర్గ్ అకౌంట్ల‌పై దాడి చేసిన అనంత‌రం హ్యాక‌ర్లు.. ‘జుక‌ర్ బ‌ర్గ్ సోష‌ల్ మీడియాలో వాడిన పాస్‌వ‌ర్డ్ లు ఇవే’ నంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశార‌ట‌.

  • Loading...

More Telugu News