: కైలాస శిఖరం ముందు సుబ్రహ్మణ్య స్వామి... మీరూ చూడండి!
పవిత్రమైన కైలాస, మానస సరోవర యాత్రకు వెళ్లిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అక్కడి చిత్రాలను తన ట్విట్టర్ ఖాతాద్వారా పంచుకున్నారు. సాక్షాత్తూ పరమశివుడి నివాసంగా భావించే కైలాస శిఖరం ముందు నిలబడి ఫోటోలు దిగారు. మానస సరోవరంలో స్నానం చేసినట్టు తెలిపారు. కాగా, 1981లో సుబ్రహ్మణ్య స్వామి చొరవతోనే కైలాస మానససరోవర యాత్రకు వెళ్లే భారతీయ భక్తులకు అవకాశాలు పెరిగాయి. అప్పట్లో చైనా నేత డెంగ్ క్సియాపోంగ్ తో పలు దఫాలుగా చర్చించిన స్వామి, యాత్రికుల కోసం దారిని తెరిచేందుకు ఆ దేశాన్ని ఒప్పించారు. సుబ్రహ్మణ్యస్వామి పోస్టు చేసిన చిత్రాన్ని మీరూ చూడవచ్చు.