: అంతా నా అదృష్టం: నరేంద్ర మోదీ
ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా ఇండియా నిలవడం తన అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దోహాలోని ప్రవాస భారతీయులతో సమావేశమైన ఆయన, "ప్రపంచ రేటింగ్ ఏజన్సీల గణాంకాల ప్రకారం, ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఏదైనా ఉందంటే, అది ఇండియానే. ఆర్థికమాంద్యం, వర్షాభావం నెలకొన్నా ఇండియా దూసుకెళుతోంది. గడచిన త్రైమాసికంలో 7.9 శాతం వృద్ధి రేటు నమోదైంది. అంతా నా అదృష్టమే" అని ఆయన అన్నారు. అంతకుముందు ఖతార్ ప్రభుత్వంతో 7 ఒప్పందాలను కుదుర్చుకున్న ఆయన, అక్కడి వ్యాపార వేత్తలతోనూ సమావేశమైన సంగతి తెలిసిందే.