: ఇటలీ నావికుల కేసులో సుప్రీంను తప్పుబట్టిన ఇటలీ న్యాయ నిపుణురాలు


భారత జాలర్ల హత్య కేసులో ఇద్దరు ఇటలీ నావికులపై ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) దర్యాప్తు కొనసాగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని.. ఆదేశ న్యాయ నిపుణురాలు ఏంజెలా డెల్ వెచ్చియో తప్పుబట్టారు. భారతదేశం అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తూనే ఉందన్నారు. వీరిద్దరిపైనా ఇటలీ కోర్టులలోనే విచారణ జరిగేలా పోరాడాల్సిన బాధ్యత ఇటలీ ప్రభుత్వంపై ఉందనీ,అయితే అలా ఎందుకు జరగడం లేదో తనకు అర్ధం కావడం లేదనీ ఆమె అన్నారు.

రోమ్ 'ఎల్ యూఐఎస్ ఎస్' విశ్వ విద్యాలయంలో అంతర్జాతీయ చట్టంపై న్యాయ నిపుణురాలు ఏంజెలా డెల్ ప్రసంగించారు. ఇటలీ నావికుల కేసులో ఐక్యరాజ్యసమితి ఆమోదించిన సముద్రజలాల చట్టం ప్రకారం.. ఒక రాష్ట్ర అంతర్జాతీయ న్యాయమూర్తి లేదా మూడవ వ్యక్తి మధ్యవర్తిత్వంతో వివాదాస్పద కేసును దర్యాప్తు చేయవచ్చన్నారు.

  • Loading...

More Telugu News