: పెద్ద హీరోలకు ఆ మాత్రం సత్తా లేదా?: దాసరి సంచలన వ్యాఖ్యలు


పెద్ద చిత్రాలకు ప్రమోషన్లు ఎందుకని, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సత్తా స్టార్ హీరోలకు లేదా? అని దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రశ్నించారు. తోట గోపాల్ దర్శకత్వంలో వస్తున్న 'కొత్త కొత్తగా ఉన్నది' చిత్రం ఆడియో సీడీని ఆవిష్కరించిన సందర్భంగా దాసరి మాట్లాడుతూ, చిన్న సినిమాలకు ఆడియో వేడుకలు, ప్రమోషన్ కార్యక్రమాలు అవసరమని, పెద్ద చిత్రాలకు అటువంటివి వద్దని ఆయన సలహా ఇచ్చారు. చిత్రం విడుదలకు ముందే ఆకట్టుకునే ట్రయిలర్లు, భారీ ఎత్తున వేడుకలు జరుపుతున్నారని, దీంతో సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయని వెల్లడించిన దాసరి, ఆపై సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైతే, హీరోలు తిరిగి డబ్బులు చెల్లించే పరిస్థితి వస్తోందని అన్నారు. ఈ పరిస్థితి మారాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News