: మహ్మద్ అలీని ‘బాహుబలి’గా అభివర్ణించిన చంద్రబాబు!


ప్రపంచం గర్వించదగ్గ క్రీడాకారుడిగా బాక్సింగ్ లెజెండ్ మహ్మద్ అలీకి మంచి గుర్తింపే ఉంది. పిన్న వయసులోనే బాక్సింగ్ రింగ్ లోకి దూకేసిన అలీ.... మూడు పర్యాయాలు ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ గా సత్తా చాటారు. ఇటీవలే తుది శ్వాస విడిచిన ఆ బాక్సింగ్ రారాజుకు నిన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నివాళి అర్పించారు. మహ్మద్ అలీ మృతికి సంతాపం ప్రకటిస్తూ నిన్న చంద్రబాబు ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో అలీని చంద్రబాబు ‘బాహుబలి’గా అభివర్ణించారు. ‘‘మూడు సార్లు ప్రపంచ హెవీ వెయిట్ చాంపియన్ గా నిలిచిన మహ్మద్ అలీ భారతీయుల హృదయాల్లో బాహుబలిగా నిలిచారు’’ అని చంద్రబాబు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News