: చిరంజీవి కొత్త సినిమాకు కొరియోగ్రాఫర్ గా పిలిస్తే పనిచేస్తాను: ప్రభుదేవా


మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రానికి కొరియోగ్రాఫర్ గా పిలిస్తే చేస్తానని ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరుపొందిన ప్రభుదేవా పేర్కొన్నాడు. ‘అభినేత్రి’ చిత్రాన్ని మూడు భాషల్లో ప్రభుదేవా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ కథ యూనివర్శల్ గా అందరినీ మెప్పిస్తుందని చెప్పాడు. బాలీవుడ్ లోకి వెళ్లినప్పుడు అక్కడి వాళ్లను కన్విన్స్ చేయడం కష్టమనిపించిందా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, ‘నేను వాళ్ల ట్రాక్ లోకి వెళ్లిపోయాను. వాళ్లను అనుసరించి నడుచుకున్నాను’ అని చెప్పాడు.

  • Loading...

More Telugu News